Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు..

ABN, Publish Date - May 11 , 2025 | 01:10 PM

వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వడదెబ్బ, అలసట, నిర్జలీకరణం, చర్మ సమస్యలతో పాటూ జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తుంటాయి.

Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు.. 1/6

వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వడదెబ్బ, అలసట, నిర్జలీకరణం, చర్మ సమస్యలతో పాటూ జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు.. 2/6

వేసవిలో ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి.. వృద్ధులు, పిల్లల్లో రోగ నిరోధక శక్తిని మరింత పెంచుతుంది.

Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు.. 3/6

వేసవిలో వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి వేసవి జ్వరం నుండి రక్షించడంలో సాయపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, బి6, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు.. 4/6

బాదం పప్పులు తినడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి.. ఉదయం పాలు, పండ్ల రసం లేదా తేనెతో కలిపి తినాలి. వేసవిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంలో బాదం పప్పులు సాయం చేస్తాయి.

Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు.. 5/6

వేసవి తాపాన్ని తగ్గించడంలో పసుపు కూడా బాగా పని చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. క్యాన్సర్, మధుమేహం, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు.. 6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 11 , 2025 | 01:10 PM