Health Tips: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..

ABN, Publish Date - Sep 05 , 2025 | 09:59 PM

ప్రస్తుతం ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు ఒక వయసు దాటిని వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ప్రస్తుతం చిన్న యువకుల్లో కూడా కనిపిస్తోంది.

Health Tips: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. 1/5

ప్రస్తుతం ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు ఒక వయసు దాటిని వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ప్రస్తుతం చిన్న యువకుల్లో కూడా కనిపిస్తోంది. అయితే డయాబెటిస్ సోకే ముందు పాదాలలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమైతే.. డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

Health Tips: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. 2/5

రాత్రి సమయంలో తరచూ అరికాళ్లలో మంటగా అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే పాదాలు చల్లగా మారుతున్నా కూడా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

Health Tips: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. 3/5

పాదాల రంగులో మార్పు కనిపిస్తే అప్రమత్తమవ్వాలి. పాదాలు పసుపు లేదా నీలం రంగులోకి మారుతుంటే.. అది డయాబెటిస్‌కు సంకేతం కావొచ్చు.

Health Tips: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. 4/5

పాదాల చర్మం పొడిగా మారడంతో పాటూ పొరలుగా మారుతూ దురదగా అనిపిస్తుంటే వెంటనే అప్రమత్తమవ్వాలి.

Health Tips: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. 5/5

గాయాలు మానడంలో ఆలస్యం, నొప్పి లేదా తిమ్మిరి, గోళ్లలో మార్పులు కూడా డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Sep 05 , 2025 | 09:59 PM