Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే..

ABN, Publish Date - Jun 22 , 2025 | 08:13 PM

ప్రతి ఇంట్లో బల్లుల బెడద కామన్‌గా ఉంటుంది. కొందరు బల్లిని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. అవి మీద పడితే అప శకునం, శబ్ధం చేస్తే శుభ శకునంలా భావిస్తుంటారు. అయితే ..

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 1/8

ప్రతి ఇంట్లో బల్లుల బెడద కామన్‌గా ఉంటుంది. కొందరు బల్లిని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. అవి మీద పడితే అప శకునం, శబ్ధం చేస్తే శుభ శకునంలా భావిస్తుంటారు. అయితే ఎవరికీ బల్లుల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 2/8

కొన్ని బల్లులు తమ చర్మాన్ని తామే తింటాయి. అలాగే కొన్ని బల్లులు తమ చర్మాన్ని తామే వదిలించుకుని, తర్వాత దాన్ని తామే తింటాయి. ఇలా చేయడం వల్ల పోషకాలు రీసైకిల్ అవుతాయట.

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 3/8

పోషకాలు, ఖనిజాలను తిరిగి పొందేందుకు ఇలా చేసే బల్లులు.. తమ శత్రువులకు తమ జాడను తెలియకుండా ఉండేందుకు కూడా ఇలా చేస్తాయట.

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 4/8

బల్లులు క్లోకా అనే రంధ్రం ద్వారా మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తాయి. తమ శరీరంలో పేరుకుపోయిన ఘన, ద్రవ వ్యార్థాలను ఈ రంధ్రం ద్వారా బయటికి పంపిస్తుంటాయి. అలాగే పునరుత్పత్తి కోసం కూడా దీన్ని ఉపయోగిస్తుంటాయి.

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 5/8

బల్లి తోక శరీరం నుంచి వేరు చేయబడిన తర్వాత కూడా చాలా నిముషాల వరకూ నేలపై ఎగురుతూ ఉంటుంది. ఇది శత్రువుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 6/8

బల్లులు కొన్నిసార్లు తమ పిల్లలను తామే తింటాయి. అన్ని బల్లులూ ఇలా చేయకపోయినా.. ఇగువానాలు, మానిటర్ బల్లులు తదితర జాతులు.. ఆహారం దొరకని సమయంలో తమ పిల్లలను తామే తింటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు చనిపోయిన పిల్లలను కూడా తింటుంటాయి.

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 7/8

బల్లులు వేటాడడమే కాకుండా తమ పరిసరాల్లో దుర్వాసనను గుర్తించడానికి తమ నాలుకను లోపలికి, బయటికి ఎగురవేస్తుంటాయి. అలాగే గాలి నుంచి దుర్వాసన కణాలను సేకరించి, వాటిని నోటి పైభాగంలో ఉన్న జాకబ్సన్స్ ఆర్గాన్ అనే ప్రత్యేక అవయవానికి బదిలీ చేస్తాయి.

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే.. 8/8

ఈ అవయవం సేకరించిన వాసనను విశ్లేషిస్తుంది. ఇది బల్లుల ఆహారాన్ని కనుగొనడం, సహచరులను కనుగొనడంలో సాయపడుతుంది.

Updated at - Jun 22 , 2025 | 08:13 PM