Terrible Tourist Places: భారతదేశంలోని అత్యంత భయంకరమైన 5 టూరిస్టు ప్రాంతాలు ఇవే..
ABN, Publish Date - May 03 , 2025 | 09:45 PM
భారత దేశంలో అనేక అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఇదే ఇండియాలో కొన్ని భయానక పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి.
1/6
భారత దేశంలో అనేక అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఇదే ఇండియాలో కొన్ని భయానక పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి 5 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2/6
రాజస్థాన్ అల్వార్‌లోని భాన్‌గర్ కోట ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటి. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటను శాపగ్రస్తమైనదిగా చెబుతుంటారు. ఈ కోట వెనుక ఒక యువరాణి, తాంత్రికుడి కథను చెబుతుంటారు. కోట లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో దయ్యాలు ఉన్నాయని, అప్పుడప్పుడూ వింత శబ్దాలు వినపడుతుంటాయని స్థానికులు చెబుతుంటారు.
3/6
రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుండి 18 కి.మీ దూరంలో ఉన్న కుల్ధారా గ్రామాన్ని దయ్యాల గ్రామంగా పిలుస్తుంటారు. 1825లో ఈ గ్రామంలో 83 మంది గ్రామస్తులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. గ్రామంలో 410 భవనాల అవశేషాలు, గ్రామ శివార్లలో మరో 200 భవనాలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని వదిలివెళ్లే సమయంలో దీన్ని ఎవరూ స్వాధీనం చేసుకోలేరని, అలా చేస్తే వింత సమస్యలను ఎదుర్కొంటారని బ్రాహ్మణులు శపించారట. అప్పటి నుంచి ఈ గ్రామంలోకి వెళ్లేందుకు అంతా భయపడుతుంటారు.
4/6
కలకత్తాలోని నేషనల్ లైబ్రరీ కూడా భయానక ప్రాంతాల్లో ఒకటి. ఈ గ్రంథాలయ పునరుద్ధరణ సమయంలో జరిగిన ప్రమాదంలో 12 మంది మరణించారు.అందుకే ఈ ప్రదేశాన్ని దయ్యాల ప్రాంతంగా పిలుస్తుంటారు. రాత్రి వేళల్లో ఇక్కడ ఉండటానికి సెక్యూరిటీ గార్డులు కూడా భయపడుతుంటారు.
5/6
గోవాలోని త్రీ కింగ్స్ చర్చి కూడా భయానక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ముగ్గురు రాజులు ఈ చర్చి ఆస్తి కోసం పోరాడి ఒకరినొకరు చంపుకున్నారని, అప్పటి నుండి వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
6/6
సిమ్లాలోని చార్లెవిల్లే మాన్షన్ అనే భవనాన్న దెయ్యాలకు నిలయంగా పిలుస్తుంటారు. రాత్రి పూట ఈ భవనంలో అడుగుల చప్పుడు, వింత స్వరాలు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు.
Updated at - May 03 , 2025 | 09:46 PM