Birds Can't Fly : ఈ 8 పక్షులు రెక్కలున్నా ఎగరలేవు..
ABN, Publish Date - Mar 02 , 2025 | 05:31 PM
Birds Having Wings Cannot Fly : ప్రపంచవ్యాప్తంగా పక్షుల్లో వేల రకాలు జాతులున్నాయి. వీటిలో చాలామటుకు రివ్వు రివ్వుమంటూ ఆకాశంలో ఎగరగలిగేవే. కోళ్లు లాంటి పక్షులైతే కనీసం కాస్త ఎత్తులో అయినా ఎగరగలవు. కానీ, ఈ 8 పక్షులు రెక్కలు ఉన్నా ఎప్పటికీ ఎగరలేవు.. ఎందుకో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా వేలాది జాతుల పక్షులు కనిపిస్తాయి. వాటిలో ఎక్కువ భాగం ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ కొన్ని పక్షులు రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేవు. ఈ పక్షుల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాం.

ప్రపంచంలోని అతిపెద్ద పక్షులలో ఒకటైన నిప్పుకోడి లేదా ఆస్ట్రిచ్ రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేదు. ఇది నేలపై గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది.

అంటార్కిటికా ద్వీపంలో కనిపించే పెంగ్విన్ పక్షి కూడా ఎగరలేదు. ఒక పెద్ద పెంగ్విన్ రోజుకు 450 సార్లు వేటాడేందుకు నీటిలోకి వెళ్తుంది.

ప్రపంచంలోనే ఉష్ట్రపక్షి తర్వాత రెండవ అతిపెద్ద పక్షి ఈము. ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పక్షి 1.9 మీటర్ల పొడవు వరకు ఉంటుంది.

దక్షిణ అట్లాంటిక్ దీవులలో కనిపించే ఫాక్లాండ్ స్టీమర్ బాతు ముదురు బూడిద రంగులో ఉంటుంది. ఇవి కూడా ఎగరలేవు

న్యూజిలాండ్‌లో కనిపించే చిన్న మచ్చల కివి దాని జాతిలో అతి చిన్న పక్షి. రెక్కలు ఉన్నప్పటికీ, అది ఎగరలేదు.

అమెరికాలో కనిపించే గ్వామ్ రైల్ పక్షికి రెక్కలు ఉన్నా.. కండరాలు లేని కారణంగా ఎగరలేదు.

టకాహే పక్షిని 1984లో న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపంలో కనుగొన్నారు. రెక్కలు ఉన్నప్పటికీ, ఈ పక్షులు ఎగరలేవు.
Updated at - Mar 02 , 2025 | 05:34 PM