Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు..

ABN, Publish Date - Jul 12 , 2025 | 04:12 PM

ప్రస్తుతం చాలా మంది అనేక మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు ఆందోళన నుంచి బయటపడలేక సతమతమవుతుంటారు.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 1/8

ప్రస్తుతం చాలా మంది అనేక మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు ఆందోళన నుంచి బయటపడలేక సతమతమవుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 2/8

మీ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలకూర, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 3/8

ఊరగాయలు, క్యాబేజీని ఉప్పుతో పులియబెట్టి చేసే సౌర్‌క్రాట్, పాలతో చేసే కేఫీర్ వంటి పదార్థాలలో ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక సమస్యలకు బాగా పనిచ చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 4/8

జింక్ అధికంగా ఉండే జీడిపప్పు, గుడ్డు సొన వంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 5/8

మీ ఆహారంలో అవకాడో, బాదం వంటి విటమిన్ బి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య తగ్గుతుంది.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 6/8

సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆందోళనను తగ్గించడంలో బాగా పని చేస్తాయి.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 7/8

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాల్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటూ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jul 12 , 2025 | 04:12 PM