Carrot Health Tips: రోజూ మీ ఆహారంలో.. క్యారెట్‌ను చేర్చడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Sep 18 , 2025 | 08:10 PM
రోజూ మీ ఆహారంలో క్యారెట్‌ను చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
1/8
రోజూ మీ ఆహారంలో క్యారెట్‌ను చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/8
క్యారెట్లలో విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలో ఉండే బీటా కెరోటిన్.. కళ్లను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంతో పాటూ కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3/8
రోజూ మీ ఆహారంలో క్యారెట్ చేర్చడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది . క్యారెట్‌లోని పోషకాలు వ్యాధితో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.
4/8
క్యారెట్లలో పొటాషియం, కరిగే ఫైబర్.. రక్తపోటు నియంత్రిస్తుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలోనూ సాయం చేస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
5/8
క్యారెట్లలోని ఫైబర్ మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్యారెట్లు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహించడంతో పాటూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
6/8
క్యారెట్లు చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ గ్లూకోజ్ శోషణ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది.
7/8
రోజూ మీ ఆహారంలో క్యారెట్లను చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. క్యారెట్లలోని యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
8/8
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Sep 18 , 2025 | 08:13 PM