Health Tips: రోజూ శనగలు తింటే.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Aug 10 , 2025 | 09:48 PM
శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ తదితర అనేక పోషకాలు ఉంటాయి. రోజూ శనగలను తినడ వల్ల శరీరం ఉక్కుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
1/6
శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ తదితర అనేక పోషకాలు ఉంటాయి. రోజూ శనగలను తినడ వల్ల శరీరం ఉక్కుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. శనగలను నానబెట్టి లేదా వేయించి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/6
శనగలను రోజూ తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. ఇందులోని ఫైబర్ బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే శనగల్లోని ప్రోటీన్ శరీరానికి మేలు చేస్తుంది.
3/6
ఎముకల సంబంధిత సమస్యలను తగ్గిచండంలో శనగలు బాగా పని చేస్తాయి. రోజూ శనగలను తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అలాగే మధుమేహ రోగులకు కూడా శనగలు మెరుగైన ఫలితాలను ఇస్తాయి.
4/6
రోజూ శనగలు తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అదేవిధంగా కడుపు సమస్యలు తగ్గి, పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
5/6
మానసిక సమస్యలను తగ్గించడంలోనూ శనగలు బాగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
6/6
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Aug 10 , 2025 | 09:48 PM