watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - May 09 , 2025 | 07:23 AM

వేసవిలో ఎంతో మంది ఇష్టంగా తినే వాటిలో పుచ్చకాయ ఒకటి. అయితే దీన్ని తినే వారు అందులోని విత్తనాలను పారేసి తింటుంటారు. అయితే..

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 1/8

వేసవిలో ఎంతో మంది ఇష్టంగా తినే వాటిలో పుచ్చకాయ ఒకటి. అయితే దీన్ని తినే వారు అందులోని విత్తనాలను పారేసి తింటుంటారు. అయితే పుచ్చకాయ గింజలను తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 2/8

పుచ్చకాయ విత్తనాలను నీటితో శుభ్రం చేసి.. తర్వాత వాటిపై కొంచెం ఆలివ్ నూనె, ఉప్పు చల్లుకోవాలి. ఆ తర్వాత వాటిని బేకింగ్ పేపర్ మీద వేసి ఓవెన్‌లో ఉంచాలి. ఓవెన్ ఉష్ణోగ్రత 325 డిగ్రీల ఫారెన్‌‌హీట్ ఉండేలా సెట్ చేసుకోవాలి. 7 నిముషాల తర్వాత వాటిని బయటికి తీసి మరో ఏడు నిముషాలు కాల్చాలి. ఇలా చేసిన తర్వాత వాటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 3/8

పుచ్చకాయ గింజల్లో అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. శరీరంలో బలహీనత, ఖనిజాల లోపం వంటి సమస్యలకు మందులు తీసుకోవడం కంటే పుచ్చకాయ గింజలను తీసుకోవడం ఉత్తమం. ఈ విత్తనాల్లో ఉండే ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది.

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 4/8

శరీరంలో ఇనుము స్థాయి తక్కువగా ఉండే వారు పుచ్చకాయ గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గింజల్లో అధిక మొత్తంలో ఉండే ఇనుము.. రక్తం ఏర్పడటానికి సహాయపడుతుంది.

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 5/8

పుచ్చకాయ గింజలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటూ ఆరోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది.

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 6/8

పుచ్చకాయ గింజల్లోని జింక్.. ఎముకల బలోపేతానికి సాయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియ, నాడీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 7/8

ఈ గింజల్లోని మెగ్నీషియం.. జీవక్రియ, హార్మోన్లు, గుండె ఆరోగ్యానికి బాగా పని చేస్తుంది. అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు అనుకూలంగా ఉంటుంది.

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 09 , 2025 | 07:23 AM