Soaked Cashew: నానబెట్టిన జీడిపప్పును తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Apr 24 , 2025 | 09:46 PM
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అలాగే నానబెట్టిన జీడిపప్పు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
1/6
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అలాగే నానబెట్టిన జీడిపప్పు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నానబెట్టిన జీడిపప్పులో ఉండే మెగ్నీషియం శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
2/6
నానబెట్టిన జీడిపప్పును క్రమం తప్పకుండా తీనడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
3/6
జీడిపప్పులో ఉండే మెగ్నీషియం పొటాషియం తదితర పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
4/6
నానబెట్టడం వల్ల జీడిపప్పులో ఉండే ఫైటిక్ ఆమ్లం కరిగిపోతుంది. ఇది జీర్ణక్రియను సులభం చేయడంతో పాటూ పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.
5/6
జీడిపప్పులో ఐరన్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
6/6
జీడిపప్పులో విటమిన్ -ఇ తదిర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చర్మం యవ్వనంగా, మెరుస్తూ ఉంచడంలో సాయపడతాయి. జుట్టును బలంగా చేయడంలోనూ సహకరిస్తాయి.
Updated at - Apr 24 , 2025 | 09:46 PM