Health Tips: రోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల కలిగే 6 ప్రయోజనాలివే..
ABN, Publish Date - Jun 27 , 2025 | 04:41 PM
అన్ని రకాల వంటల్లో ఉపయోగించే వాటిలో టమాటా ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే టమాటా లేని కూర ఉండదంటే అతిశయోక్తికాదు. టమాటాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే..
1/8
అన్ని రకాల వంటల్లో ఉపయోగించే వాటిలో టమాటా ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే టమాటా లేని కూర ఉండదంటే అతిశయోక్తికాదు. టమాటాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే పచ్చి టమాటాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/8
రోజూ పచ్చి టమాటాలు తినడం వల్ల.. వాటిలోని లైకోపీన్, విటమిన్ సి తదితర పోషకాలు చర్మానికి పోషకాలను అందిస్తాయి. తద్వారా చర్మం హైడ్రేట్‌గా ఉండడంతో పాటూ కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అలాగే టమాటా రసాన్ని ముఖంపై పూసినా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
3/8
టమాటాల్లో ఉండే ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి.
4/8
టమాట్లోని లైకోపీన్, పొటాషియం, ఫోలేట్ తదితర పోషకాలు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటూ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. అలాగే రక్తనాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తాయి. తద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
5/8
టమాటాల్లోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, అలెర్జీలు దూరమవుతాయి.
6/8
శరీరంలోని విషాన్ని తొలగించడంలో టమాటాలు బాగా పని చేస్తాయి. అలాగే కాలేయం, మూత్రపిండాలను శుభ్రం చేయడంలోనూ సహకరిస్తాయి.
7/8
టమాటాల్లో కేలరీలు తక్కువగా ఉండడంతో పాటూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి టమాటాలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
8/8
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jun 27 , 2025 | 04:41 PM