Dangerous Plants: భూమిపై మనుషులను చంపగల అత్యంత ప్రమాదకరమైన 7 మొక్కలివే..
ABN, Publish Date - Sep 25 , 2025 | 12:16 PM
భూమిపై మొక్కల వల్ల మానవ మనుగడ సాధ్యమవుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనుషుల ప్రాణాలు కాపాడే మొక్కలు ఉన్నట్లే.. ప్రాణాలు తీసే మొక్కలు కూడా ఇదే భూమ్మీద మన చుట్టూ ఉంటాయి.
1/8
భూమిపై మొక్కల వల్ల మానవ మనుగడ సాధ్యమవుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనుషుల ప్రాణాలు కాపాడే మొక్కలు ఉన్నట్లే.. ప్రాణాలు తీసే మొక్కలు కూడా ఇదే భూమ్మీద మన చుట్టూ ఉంటాయి. మనుషులను చంపగల 7 అత్యంత ప్రమాదకరమైన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2/8
ఆముదం గింజల గురించి అందరికీ తెలిసిందే. వీటి నుంచి ఆముదం తయారు చేస్తారు. అయితే పచ్చి ఆముదం గింజల్లో రిసిన్ అనే విషం దాగి ఉంటుంది. రెండు పచ్చి ఆముదం గింజల్లో ఒక పిల్లాడిని చంపేంత విషం ఉంటుంది. అదే 8 గింజల్లో పెద్ద వారిని చంపేంత విషం ఉంటుందట. రిసిన్ అనే విషం వల్ల వాంతులు, విరేచనాలు, మూర్ఛ తదితర సమస్యలతో పాటూ మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుందట.
3/8
డెడ్లీ నైట్ షేడ్ అనే మొక్క కూడా విషపూరితమైనది. ఈ చెట్టుకు నల్ల బెర్రీలు కాస్తాయి. ఇవి చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తాయి. పొరపాటున ఈ పండ్లను తింటే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిలో కండరాలను స్తంభింపజేయడంతో పాటూ గుండెను ఆపేసే టాక్సిన్స్ ఉంటాయట. ఈ మొక్కల ఆకులను తాకడం వల్ల చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి.
4/8
అందమైన పూలతో కనిపించే ఒలియాండర్ మొక్క కూడా చాలా ప్రమాదం. ఈ పూల నుంచి తయారయ్యే తేనె మనుషులకు హాని చేస్తుంది. పొరపాటున దీన్ని తీసుకుంటే వాంతులు, మూర్ఛతో పాటూ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మొక్క చాలా చేదుగా ఉండడం వల్ల సాధారణంగా అంతా దీనికి దూరంగా ఉంటారు.
5/8
విషపూరితమైన మొక్కల్లో ఎరుపు, నలుపు విత్తనాలతో కూడిన రోజరీ పీ అనే మొక్క ఒకటి . వీటి విత్తనాలు ఆభరణాలు, ప్రార్థన పూసల్లోనూ వాడుతుంటారు. అయితే వీటిలో అబ్రిన్ అనే విషం ఉంటుందట. ఈ విత్తనాలను నమిలితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందకంటే ఒక విత్తనంలో మనిషిని చంపగల విషం ఉంటుందట.
6/8
అగెరటినా అల్టిసిమా అని పిలువబడే తెల్ల పాము మొక్కలు కూడా చాలా ప్రమాదకరం. ఈ మొక్క అబ్రహం లింకన్ తల్లి నాన్సీ హాంక్స్ మరణానికి కారణమైందట. ఈ మొక్కల్లో ట్రెమాటోల్ అనే విషం ఉంటుందట. ఈ మొక్కను తిన్న ఆవులు, గేదెల పాలు తాగినా కూడా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందట. వికారం, కడుపు నొప్పితో పాటూ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందట.
7/8
పొగాకు మొక్కల్లోనూ నికోటిన్ అనే విషం ఉంటుంది. దీన్ని నేరుగా తింటే ప్రాణాలు తీస్తుంది. ఈ పొగాకు పీల్చడం వల్ల క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. ఈ పొగాకు కారణంగా ఏటా 5 మిలియన్ల మంది చనిపోతున్నారు.
8/8
వాటర్ హెమ్లాక్ అనే అందమైన మొక్క అమెరికాలో ఎక్కువ కనిపిస్తుంది. ఇది చూసేందుకు అందంగా ఉన్నా కూడా దీని వేళ్లలో సికుటాక్సిన్ అనే విషం ఉంటుందట. దీన్ని తింటే మూర్ఛ, కడుపులో తిమ్మిరి, వికారం, జ్ఞాపక శక్తి కోల్పోవడంతో పాటూ కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట.
Updated at - Sep 25 , 2025 | 12:16 PM