Health Tips: నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగుతున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు..

ABN, Publish Date - Sep 10 , 2025 | 11:17 AM

ధూమపానం అలవాటు ఉన్న వారంతా.. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడం కంటే ముందు సిగరెట్ వెలిగించి గుప్పు గుప్పున దమ్ము కొడుతుంటారు. ఇలా చేయడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Health Tips: నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగుతున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు.. 1/6

ధూమపానం అలవాటు ఉన్న వారంతా.. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడం కంటే ముందు సిగరెట్ వెలిగించి గుప్పు గుప్పున దమ్ము కొడుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే సిగరెట్ తాగనిది డే స్టార్ట్ అవదు అన్నంతలా ఎడిక్ట్ అయిపోతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అ నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగుతున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు.. 2/6

నిద్ర లేవగానే శరీరం రీసెట్ మోడ్‌లో ఉంటుంది. రాత్రి విషపదార్థాల తొలగించిన ఊపిరితిత్తులు.. ఉదయాన్నే మరమ్మతు పనుల్లో ఉంటాయి. అయితే ఉదయం సిగరెట్ తాగడం వల్ల మరమ్మతు ప్రక్రియ ఆగిపోతుంది.

Health Tips: నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగుతున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు.. 3/6

సిగరెట్‌లోని రసాయనాలు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ కలిగించే కారకాల ప్రభావం పెరిగిపోతుంది.

Health Tips: నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగుతున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు.. 4/6

నిద్ర లేచిన సమయంలో ఊపిరితిత్తులు తక్కువ శ్లేష్మం, రక్షిత స్రావాలతో కప్పబడి ఉంటాయి. సిగరెట్ తాగడం వల్ల అందులోని విష పదార్థాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగుతున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు.. 5/6

ఉదయం శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అప్రమత్తంగా ఉండడంతో పాటూ దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి. అయితే సిగరెట్ తాగడం వల్ల అందులోని నికోటిన్ శరీరంపై ఒత్తిడి కలిగిస్తుంది.

Health Tips: నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగుతున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు.. 6/6

ఉదయం సిగరెట్లు తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. దీనికితోడు రక్తపోటు, నిరాశ, స్ట్రోక్ తదితర ప్రమాదాలు పెరుగుతాయి.

Updated at - Sep 10 , 2025 | 11:17 AM