Health Tips: నెయ్యి దీపం వెలిగించిన గదిలో నిద్రపోతే.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Aug 22 , 2025 | 01:46 PM
ప్రశాంతమైన నిద్ర కోసం నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. నెయ్యి దీపం వెలిగించిన గదిలో పడుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు.
1/6
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషి ప్రశాంతతను కోల్పోతున్నాడు. చాలా మంది కనీసం మంచి నిద్రకూ నోచుకోలేకపోతున్నారు. ఈ కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రశాంతమైన నిద్ర కోసం నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. నెయ్యి దీపం వెలిగించిన గదిలో పడుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/6
నెయ్యి దీపం నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మీ నాడీ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
3/6
నెయ్యిలోని విటమిన్ ఎ, డీ, ఈ, సీలు చర్మం ప్రకాశవంతంగా మారేందుకు సహకరిస్తాయి. అలాగే కణాల మరమ్మత్తులో కూడా సాయం చేస్తాయి.
4/6
నెయ్యి ఆమ్లతను తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర వల్ల శరీరం, మనస్సు ఆరోగ్యం ఉంటుంది.
5/6
నెయ్యి దీపం నుంచి వచ్చే వాసన పీల్చడం వల్ల గురక సమస్య కూడా తగ్గుతుంది. అలాగే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
6/6
మంచి ఫలితాల కోసం స్వచ్ఛమైన నెయ్యిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే శ్వాసకోశ తదితర సమస్యలు ఉన్న వారు వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
Updated at - Aug 23 , 2025 | 02:11 PM