Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే.. జుట్టు రాలిపోదు....

ABN, Publish Date - Feb 28 , 2025 | 08:26 PM

Hair Care Tips : జుట్టు ఒత్తుగా, అందంగా ఉండాలని కోరుకోని వారెవరూ ఉండరు. అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మార్కెట్లో ఎంతో ఖరీదు పెట్టి కండీషనర్లు, షాంపూలు వాడుతున్నా కొంచెం కూడా ఫలితం కనిపించదు చాలాసార్లు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ సింపుల్ చిట్కాలతో జుట్టు రాలిపోదు.. చాలా త్వరగా పెరుగుతుంది..

Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే..  జుట్టు రాలిపోదు.... 1/7

దాదాపు ప్రతి స్త్రీ నల్లగా, పొడవుగా, ఒత్తుగా మెరిసే జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటుంది . అందుకోసం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. అయితే అందమైన జుట్టు కావాలంటే ఇలా చేయండి.

Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే..  జుట్టు రాలిపోదు.... 2/7

జుట్టు ఒత్తుగా పెరగడానికి మీరు నిస్సందేహంగా ఈ టిప్స్ ఫాలో అవ్వచ్చు. షాంపూ చేసుకునేటప్పుడు ఇలా ప్రయత్నించవచ్చు.

Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే..  జుట్టు రాలిపోదు.... 3/7

ఒకటి లేదా రెండు చెంచాల కాఫీ పొడిని షాంపూలో కలిపి దానితో మీ జుట్టును శుభ్రపరచుకోండి. ఇది సులభమైన , ప్రభావవంతమైన చిట్కా.

Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే..  జుట్టు రాలిపోదు.... 4/7

గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు బలం, మెరుపును అందిస్తుంది. దృఢంగా చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. దీన్ని షాంపూతో కలిపి అప్లై చేసి క్లీన్ చేసుకుంటే జుట్టు రాలిపోవడం ఆగిపోయి త్వరగా గ్రోత్ కనిపిస్తుంది.

Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే..  జుట్టు రాలిపోదు.... 5/7

కలబంద తలకు తేమను అందిస్తుంది. జుట్టును మందంగా, ఆరోగ్యంగా చేస్తుంది. మీరు దీన్ని షాంపూలో కలిపి అప్లై చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే..  జుట్టు రాలిపోదు.... 6/7

మెంతులు జుట్టు మూలాలను కాపాడి పోషణలో కీలక పాత్ర వహిస్తాయి. మెంతుల పేస్ట్‌ను షాంపూలో కలిపి తలకు పట్టించి స్నానం చేస్తే చాలా మేలు.

Hair Care Tips : ఇలా షాంపూ చేస్తే..  జుట్టు రాలిపోదు.... 7/7

కొబ్బరి పాలల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటుంది. ఇది మృదువుగా, దట్టంగా మారడానికి సహాయపడుతుంది. అందుకే తలకు పట్టించుకుని షాంపూ చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Updated at - Feb 28 , 2025 | 08:42 PM