Health Tips: ఈ 7 వస్తువులను మీ ముఖంపై పూశారంటే.. ఏమవుతుందో తెలుసా..
ABN, Publish Date - May 14 , 2025 | 02:03 PM
ప్రస్తుతం యువతీయువకులు ఫిట్‌నెస్‌తో పాటూ అందంగా కనిపించేందుకు ఏవేవో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరైతే ముఖానికి ఏవేవో క్రీములు రాస్తుంటారు. అయితే ఇలా ముఖంపై క్రీములు రాసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
1/8
ప్రస్తుతం యువతీయువకులు ఫిట్‌నెస్‌తో పాటూ అందంగా కనిపించేందుకు ఏవేవో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరైతే ముఖానికి ఏవేవో క్రీములు రాస్తుంటారు. అయితే ఇలా ముఖంపై క్రీములు రాసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ 7 వస్తువులను ముఖంపై అప్లై చేస్తే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
2/8
ముఖంపై బాడీ లోషన్ రాసుకోవడం సమస్యలకు దారి తీస్తుంది. బాడీ లోషన్లు మందంగా ఉండడం వల్ల చర్మంపై రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది చివరకు మొటిమలు, అలెర్జీలకు దారి తీస్తుంది.
3/8
ముఖంపై చక్కెరను వినియోగించవద్దు. ఇలా చేస్తే చర్మం పొడిగా, ఎర్రగా మారి చికాకును పట్టిస్తుంది.
4/8
ముఖాన్ని వేడి నీటితో కడుక్కోకూడదు. ఇలా చేయడం వల్ల చర్మంపై తేమ స్థాయి తగ్గిపోయి సమస్యలకు దారి తీస్తుంది. గోరు వెచ్చని నీటిని వినియోగించడం వల్ల చర్మ రంధ్రాల్లో మురికి తొలగిపోతుంది.
5/8
నిమ్మకాయ తొక్కను వాడడం వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మం ఎరుపు రంగులోకి మారడంతో పాటూ చికాకును కలిగిస్తుంది.
6/8
టూత్‌పేస్టును ముఖంపై రాయడం కూడా ప్రమాదం. ఇలా చేస్తే చర్మం దెబ్బతినడంతో పాటూ మొటిమలు పెరిగిపోయాయి.
7/8
వంట సోడా ముఖానికి పూయడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అందులోని ఆల్కలీన్ లక్షణాలు చర్మంలో పీహెచ్ స్థాయిని దెబ్బతీస్తాయి. అలాగే మొటిమలు పెరిగేందుకు కారణమవుతాయి.
8/8
చర్మానికి కొబ్బరి నూనె మేలు చేసినా.. ముఖంపై రాయడం వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. తద్వారా మొటిమలు పెరిగిపోతాయి.
Updated at - May 14 , 2025 | 02:03 PM