Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ కూరగాయలు కొంటున్నారా.. అయితే జాగ్రత్త..
ABN, Publish Date - Jul 04 , 2025 | 07:05 AM
వర్షాకాలం అనేక రకాల ఇన్షెక్షన్లు వెంటాడుతుంటాయి. దీంతో ఈ సీజన్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వర్షాకాలం అనేక రకాల ఇన్షెక్షన్లు వెంటాడుతుంటాయి. దీంతో ఈ సీజన్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కూరగాయలు కొనేటప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో పాలకూర, మెంతికూర వంటి వంటి ఆకుకూరలను ఎంత శుభ్రం చేసినా.. అందులో సూక్ష్మజీవులు అలాగే ఉంటాయి. ఇలాంటివి తినడం వల్ల ఉబ్బరం, వాంతులు, విరేచనాలు తదితర సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని కొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

క్యాబేజీ, కాలీఫ్లవర్ పొరల మధ్య తేమ, బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకుపోయి ఉంటుంది. వీటిని తప్పనిసరిగా కొనాలనుకున్నప్పుడు.. ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది.

వర్షాకాలంలో పుట్టగొడుగులు కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా శుభ్రం చేయని పుట్టగొడుగులు తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

వర్షాకాలంలో బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి వీటిని కొనే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిల్వ చేసే విధానం సరిగ్గా ఉండాలి.

వర్షాకాలంలో కూరగాయలను వేడి నీరు, ఉప్పు నీరు లేదా వెనిగర్‌తో శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది. అలాగే కొనే ముందు అవి తాజాగా ఉన్నాయా, లేదా అనేది కూడా సరిచూసుకోవాలి.
Updated at - Jul 04 , 2025 | 07:05 AM