Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం..

ABN, Publish Date - Dec 27 , 2025 | 05:30 PM

కొన్ని చిత్రాలు మనల్ని ఆలోచింపజేస్తే.. మరికొన్ని చిత్రాలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇంకొన్ని చిత్రాలు మనల్ని గతంలోకి తీసుకెళ్తుంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన చిత్రాలను మీ ముందుకు తీసుకొచ్చాం.

Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం.. 1/7

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో స్టీమ్ రోడ్డు రోలర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నగరంలో రహదారుల నిర్మాణం కోసం బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన ఆవిరితో నడిచే ఈ రోడ్డు రోలర్ అప్పట్లో అధునాతన ఆవిష్కరణ అని చెప్పొచ్చు. 1936లో జాన్ పౌలర్ అండ్ కో తయారు చేసినదిగా పేటెంట్ కూడా నమోదైనట్లు ఈ స్టీమ్ రోడ్ రోలర్‌పై వివరాలు కనిపిస్తాయి. నేటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా సందర్శకులను ఆకట్టుకుంటోంది. (ఫొటోలు: ఎస్.బి.రాజేశ్వరరావు, రాజమహేంద్రవరం)

Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం.. 2/7

జీవ వైవిధ్య ఉద్యానవనంలో మిక్కీమౌస్ ట్రీ మొదట గ్రీన్ ఫ్లవర్‌గా ఆవిర్భవించింది. దానికి sepals, petals ఉంటాయి. sepals రాలిపోయి గ్రీన్ కలర్‌లో ఉన్న petals అనేవి పింక్ కలర్‌లోకి మారుతుంటాయి. ఇది చూడటానికి మిక్కీ మౌస్ లా కనిపించడం వల్ల ఈ మొక్కకు ఆ పేరు వచ్చింది. (ఫొటోలు: అబ్దుల్ రఫీ, విశాఖపట్నం)

Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం.. 3/7

మనం చాలా రకాల పుట్టగొడుగులను చూస్తుంటాం. కొన్ని తెల్లగా, కొన్ని గోధుమ రంగులో ఉండడం సర్వసాధారణం. అయితే పింక్ కలర్ పుట్టగొడుగు చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. మార్కెట్‌లో దీని ధర కూడా తక్కువే ఉంటుంది. కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తుంటారు. (ఫొటోలు: ఎస్ శివకుమార్, చిత్తూరు)

Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం.. 4/7

పార్క్‌లో రకరకాల బొమ్మలను చూస్తుంటాం. అయితే కొన్ని పార్కుల్లో పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకునేలా అనేక ఏర్పాట్లను చూస్తుంటాం. విజయనగరం విజ్జి స్టేడియంలోని పార్క్‌లో ఓ జిరాఫీ చెట్టు కొమ్మలను తింటునట్టుగా కనిపిస్తుంది. ఇది బొమ్మే అయినా చూసేందుకు అచ్చం నిజమైన జిరాఫీలాగే కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. (ఫొటోలు: డి. లక్ష్మణ్, విజయనగరం)

Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం.. 5/7

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో లారీలు, ప్రొక్లైన్లు పనిలోకి దిగినట్లుగా కనిపిస్తున్నాయి కదా. నిజానికి ఇవి పిల్లలు ఆడుకునే బొమ్మలు. వ్యాపారులు వీటిని ఇలా రోడ్డుపై ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. (ఫొటోలు: ఉమామహేశ్వరరావు, గుంటూరు)

Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం.. 6/7

చెన్నైలోని మెరీనా బీచ్.. దేశంలోనే అతిపెద్ద సహజ పట్టణ బీచ్‌లలో ఒకటి. ఈ బీచ్‌లో అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయం, బంగారు రంగులో ఉన్న ఇసుక, చారిత్రక స్మారక చిహ్నాలు పర్యాటకులను ఆకట్టుకుంటుంటాయి. అయితే ఇటీవల మెరీనా బీచ్ పట్టినబాక్కం సముద్రతీరంలో మృతి చెందిన తాబేళ్లను చూసి పర్యాటకులు అయ్యో పాపం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఫొటోలు: శ్రీనివాస్, చెన్నై )

Photo Story: స్టీమ్ రోడ్ రోలర్ నుంచి పింక్ కలర్ పుట్టగొడుగు వరకూ.. ఆశ్చర్యపరిచే చిత్రాలు మీ కోసం.. 7/7

రంగు రంగు పక్షులను చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంటుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఓ బుల్లి పిట్ట కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. నెల్లూరు పెన్నా నదిలోని కట్టపై అందమైన రంగు పిట్టలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. (ఫొటోలు: జకీర్, నెల్లూరు)

Updated at - Dec 27 , 2025 | 05:33 PM