Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు..

ABN, Publish Date - Jun 27 , 2025 | 09:55 PM

చెరకు రసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని ఇనుము, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు.. 1/7

చెరకు రసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని ఇనుము, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్న వారు చెరకు రసానికి దూరంగా ఉండాలి.

Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు.. 2/7

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు చెరకు రసం తాగకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు.. 3/7

మీకు ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఉంటే చెరకు రసం తాగకపోవడం మంచిది. తాగితే కడుపు నొప్పి సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది.

Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు.. 4/7

గర్భిణులు వైద్యుల సలహా తీసుకోకుండా చెరకు రసం తాగకూడదు. ఇలా చేయడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.

Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు.. 5/7

తలనొప్పిగా ఉన్న సమయంలోనూ చెరకు రసం తాగకూడదు. చెరకు రసంలోని ఐస్ గడ్డలు సమస్యను మరింత పెంచుతాయి. ఒకవేళ తాగాల్సి వస్తే.. ఐస్ లేకుండా తాగడం మంచిది.

Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు.. 6/7

చెరకు రసం దంతాలపై ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. అలాగే దంతాలలో కుహరం సమస్యలను పెంచుతుంది. కాబట్టి, దంత సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడం తాగకపోవడమే మంచిది.

Health Tips: ఈ సమస్యలు ఉంటే చెరకు రసం తాగొద్దు.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jun 27 , 2025 | 09:55 PM