Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..

ABN, Publish Date - Sep 17 , 2025 | 06:36 PM

ప్రస్తుతం చాలా మంది ఫిట్‌గా ఉండడంతో పాటూ అందంగా కనిపించేందుకు ఆసక్తిచూపుతున్నారు. అందంగా కనిపించాలంటే ముఖంతో పాటూ జట్టు కూడా ఒత్తుగా ఉండాలి. అయితే ప్రస్తుతం అనేక మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు..

Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. 1/7

ప్రస్తుతం చాలా మంది ఫిట్‌గా ఉండడంతో పాటూ అందంగా కనిపించేందుకు ఆసక్తిచూపుతున్నారు. అందంగా కనిపించాలంటే ముఖంతో పాటూ జట్టు కూడా ఒత్తుగా ఉండాలి. అయితే ప్రస్తుతం అనేక మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఓ అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాం. మీరు రోజూ వాడే నూనెలో ఈ పొడి కలిపి రాస్తే జుట్టు బలంగా మారడంతో పాటూ మెరిసిపోతుంది.

Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. 2/7

రోజూ మీరు వాడే నూనెలో కొద్దిగా మెంతి పొడి కలిపి జుట్టుకు రాసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీ జుట్టును వేర్ల నుండి బలోపేతం చేయడంతో పాటూ మెరిచేలా చేస్తుంది.

Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. 3/7

కొబ్బరి, బాదం లేదా ఆలివ్ నూనెలో ఈ పొడిని మిక్స్ చేయొచ్చు. ఒక చిన్న గిన్నెలో 2, 3 టేబుల్ స్పూన్ల హెయిర్ ఆయిల్ తీసుకుని, అందులో చిటికెడు మెంతుల పొడిని కలపాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత కొద్దిగా వేడి చేయాలి. చల్లార్చిన ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి.

Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. 4/7

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా వేళ్లతో బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు రక్త ప్రసరణ పెరిగి బలంగా మారుతుంది.

Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. 5/7

నూనెలో మెంతుల పొడిని కలిపి రాత్రంతా ఉంచడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఈ మిశ్రమానికి నిమ్మకాయ లేదా పెరుగు వేసి హెయిర్ మాస్క్ లాగా అప్లై చేయొచ్చు.

Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. 6/7

మెంతుల్లో ఉండే ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు.. జుట్టుకు పోషణ ఇస్తాయి. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి, చండ్రును కూడా తొలగిస్తాయి.

Hair Health Tips: మీ నూనెలో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే సదరు వైద్య నిపుణులను సంప్రదించాలి.

Updated at - Sep 17 , 2025 | 06:36 PM