Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే..

ABN, Publish Date - May 17 , 2025 | 07:14 AM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిలో ఎక్కువ వేధించే వాటిలో మలబద్ధక సమస్య ఒకటి.

Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే.. 1/7

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిలో ఎక్కువ వేధించే వాటిలో మలబద్ధక సమస్య ఒకటి. అయితే మీ ఆహారంలో కొన్ని పండ్లను చేర్చడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే.. 2/7

మలబద్ధక సమస్యకు బొప్పాయి పండు బాగా పని చేస్తుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే.. 3/7

ఎండిన ప్లమ్‌ పండ్లు తినడం వల్ల కూడా మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో కరిగే ఫైబర్‌తో పాటూ కరగని ఫైబర్, సార్బిటాల్ అనే పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి.

Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే.. 4/7

రోజూ ఒక ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. ఈ పండ్లలోని కరిగే ఫైబర్.. పెద్ద పేగులోని నీటిని లాగి, మలాన్ని మృదువుగా చేస్తుంది. తద్వారా మలవిసర్జన సాఫీగా అవుతుంది.

Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే.. 5/7

బాగా పండిన అరటిపండ్లలోని పొటాషియం, ఫైబర్.. మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే.. 6/7

బెర్రీలను ఆహారంలో చేర్చడం వల్ల కూడా మలబద్ధక సమస్యను దూరం చేయొచ్చు. ఇందులోని ఫైబర్, యంటీఆక్సిడెంట్లు.. జీర్ణక్రియకు దోహదం చేస్తాయి.

Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 17 , 2025 | 07:14 AM