Heat Stroke: మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తుంటే వడదెబ్బకు గురైనట్లే.. బయటపడేందుకు ఇలా చేయండి..
ABN, Publish Date - Apr 17 , 2025 | 07:00 AM
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు అధిక వేడి కారణంగా వడబెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ సోకే ముందు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.
1/6
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు అధిక వేడి కారణంగా వడబెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ సోకే ముందు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. దీన్ని బట్టి వెంటనే అప్రమత్తమైతే వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. అలాగే వడదెబ్బ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
2/6
వడదెబ్బకు గురైనప్పుడు శరీర ఉష్షోగ్రత వేగంగా పెరుగుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత 104°F (40°C) కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక చెమట కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడి నిర్జలీకరణానికి దారి తీస్తుంది.
3/6
కొన్ని సందర్భాల్లో వడదెబ్బ కారణంగా మెదడు, గుండె, మూత్రపిండాలతో పాటూ కండరాలకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది.
4/6
అధిక జ్వరం, తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే వడదెబ్బకు గురైనట్లు అర్థం చేసుకోవాలి. అలాగే చర్మం ఎరుపు రంగులోకి మారడం, పొడిబారడం, వాంతులు, వికారం, కండరాల తిమ్మిరితో పాటూ గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే జాగ్రత్త పడాలి.
5/6
శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. అలాగే డీహైడ్రేషన్ వల్ల తల తిరుగుడు, బలహీనత, మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు వడదెబ్బ ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
6/6
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం మానుకోవాలి. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవడంతో పాటూ లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వేడి వాతావరణలో శారీరక శ్రమ చేయకూడదు. చల్లని ప్రదేశంలో ఉండడంతో పాటూ చల్లటి నీటితో స్నానం చేస్తూ ఉండాలి.
Updated at - Apr 17 , 2025 | 07:00 AM