Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి..

ABN, Publish Date - Sep 19 , 2025 | 03:08 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాల కురుస్తున్నాయి. వర్షాల దాటికి ఇళ్ల పరిసరాలు మొత్తం బురదమయంగా మారుతున్నాయి. దీంతో విష సర్పాలన్నీ వెచ్చని ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంటాయి..

Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి.. 1/7

ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాల కురుస్తున్నాయి. వర్షాల దాటికి ఇళ్ల పరిసరాలు మొత్తం బురదమయంగా మారుతున్నాయి. దీంతో విష సర్పాలన్నీ వెచ్చని ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంటాయి. ముఖ్యంగా పాములతో జనం భయం భయంగా కాలం గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక పల్లెల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీ ఇళ్ల చుట్టూ ఉండే కొన్ని మొక్కలు.. పాములు మీ ఇంట్లోకి రావడానికి కారణం కావొచ్చు. ఇలాంటి చెట్లు ఏమైనా మీకు కనిపిస్తే వెంటనే పీకేయండి. ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి.. 2/7

అరటి చెట్లు పాములకు నిలయమని చెప్పొచ్చు. అరటి చెట్ల వేర్లు, కాండం మధ్య పాములు దాక్కుని ఉంటాయి. వర్షాకాలంలో ఇళ్ల పరిసరాల్లో అరటి చెట్లు ఉండడం వల్ల పాములు వచ్చేందుకు అవకావశం ఉంటుంది.

Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి.. 3/7

మర్రిచెట్లు కూడా పాములు రావడానికి కారణమవుతాయి. ఈ చెట్లకు ఉండే మందపాటి వేర్లు, కొమ్మలు, బెరడు పాములకు ఆవాసంగా మారతాయి. కాబట్టి మర్రి చెట్లను కూడా మీ ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోండి.

Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి.. 4/7

వెదురు చెట్లు కూడా పాములను ఆకర్షిస్తుంటాయి. వెదురు చెట్ల కింద నేల తేమగా ఉంటుంది. పాములు విశ్రాంతి తీసుకోవడానికి ఇలాంటి ప్రదేశాలనే ఎంచుకుంటుంటాయి. కాబట్టి ఈ చెట్లు ఉన్నా కూడా వెంటనే పీకేయండి.

Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి.. 5/7

తులసి మొక్కను ప్రతి ఒక్కరూ పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఇంటి వద్దా ఈ మొక్క కనిపిస్తుంది. అయితే తులసి చెట్టు చుట్టూ పెరిగే గడ్డి, పొదలు కూడా పాములకు ఆశ్రయాలుగా మారుతుంటాయి. వర్షాకాలంలో తులసి చెట్టు చుట్టూ శుభ్రంగా ఉంచుకోండి.. లేదా కుండీలో పెంచుకుంటే సమస్య ఉండదు.

Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి.. 6/7

వేప చెట్లు సాధారణంగా క్రిమి సంహారకాలుగా పని చేస్తుంటాయి. అయితే ఎండిన ఆకులు, తేమతో కూడిన వాతావరణం పాములకు ఆశ్రయంగా మారుతుంటాయి. కాబట్టి వేప చెట్టు కింద ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

Snake Repellent Tips: పాములు రాకుండా ఉండాలంటే.. మీ ఇంటి చుట్టూ ఉండే ఈ చెట్లను వెంటనే పీకేయండి.. 7/7

ఒలియాండర్, సక్యూలెంట్స్ వంటి పూల మొక్కలు కూడా పాములను ఆకర్షిస్తాయి. వాటి మందపాటి ఆకులు, మొక్కల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో పాములు దాక్కుంటాయి.

Updated at - Sep 19 , 2025 | 03:10 PM