Health Tips: ఉదయం నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్లు ఉందా.. అయితే ఇలా చేసి చూడండి..
ABN, Publish Date - Aug 29 , 2025 | 01:39 PM
చాలా మందికి నిద్రలేవగా ముఖం ఉబ్బినట్లుగా ఉంటుంది. చాలా సేపటి వరకూ అలాగే కనిపస్తుంటుంది. ఇలా ఉండడం వల్ల పది మందిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు.
1/7
చాలా మందికి నిద్రలేవగా ముఖం ఉబ్బినట్లుగా ఉంటుంది. చాలా సేపటి వరకూ అలాగే కనిపస్తుంటుంది. ఇలా ఉండడం వల్ల పది మందిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
2/7
రాత్రిపూట అధిక ఉప్పు తీసుకోవడం, తగినంత నిద్ర, నీరు లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాలతో ఉదయం లేవగానే ముఖంలో వాపు కనిపిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
3/7
దోసకాయలో ఉండే నీరు, యాంటీఆక్సిడెంట్లు ముఖానికి ఎంతో మేలు చేస్తాయి. దోసకాయను సన్ని ముక్కలుగా కోసి కళ్లు, ముఖంపై 10 నుంచి 15 నిముషాలు పెట్టడం వల్ల వాపు తగ్గుతుంది.
4/7
ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. అలాగే ఐస్ క్యూబ్‌లను మెత్తటి గుడ్డలో చుట్టి ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి వాపు తగ్గుతుంది.
5/7
తాజా కలబంద జెల్ ను ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.. మంటను, వాపును తగ్గించడంలో సాయం చేస్తాయి.
6/7
టీస్పూన్ పసుపుతో కొద్దిగా తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ముఖంపై వాపును తగ్గిస్తాయి.
7/7
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Aug 29 , 2025 | 01:39 PM