LPG Gas Cylinder Gas Checking Process : LPG సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో.. ఇలా తనిఖీ చేయండి..
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:41 PM
ఇంటికి LPG గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు ఎంత గ్యాస్ వస్తుందో చాలా మందికి తెలియదు. అంత బరువున్న సిలిండర్ ఎలా తనిఖీ చేయాలో అర్థం కాదు. కొన్ని సార్లు తక్కువ గ్యాస్ లేదా లీకేజీ గ్యాస్ కూడా డెలివరీ చేసే అవకాశం ఉంది. అలా జరగకూడదంటే ఈ విధానాల్లో గ్యాస్ సిలిండర్ చెక్ చేయండి..

గ్యాస్ సిలిండర్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ఇది సురక్షితంగా వంట చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే, ఈ కొన్ని విషయాలు ప్రజలు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే సమయంలో తప్పక గుర్తుంచుకోవాలి. లేకపోతే నష్టపోతారు.

డెలివరీ బాయ్స్ చాలా సార్లు లీకవుతున్న గ్యాస్ సిలిండర్లు ఇళ్ల వద్ద ఇచ్చేసి వెళ్తుంటారు. ఇలాంటి సిలిండర్లలో ఎంత గ్యాస్ వస్తుందో అర్థం కాదు. గ్యాస్ విడుదలైతే ప్రమాదం జరిగే అవకాశమూ ఉంది. కాబట్టి, లీక్ సిలిండర్ ఎలా తనిఖీ చేయవచ్చో, అందులో ఎంత గ్యాస్ ఉంటుందో తెలుసుకుందాం.

సిలిండర్ బరువు తూచే పరికరం డెలివరీ బాయ్స్ వద్దే ఉంటుంది. ఖాళీ సిలిండర్ బరువు 15 నుంచి 16 కిలోలు ఉండవచ్చు. అందులోని గ్యాస్ బరువు 14.02 కిలోలు.

అంటే మొత్తంగా సిలిండర్ బరువు 29 నుంచి 30 కిలోగ్రాములు తప్పక ఉండి తీరాలి. ఇది తెలుసుకునేందుకు డెలివరీ చేసే వ్యక్తిని తూచమని అడగండి. దాని పైన రాసిన బరువు (TW) కచ్చితంగా 14.2kg లు ఉందో లేదో చెక్ చేసుకోండి.

గ్యాస్ పైన 14.2 కిలోలు ఉంది కదా అంటే నమ్మకండి. ఎలక్ట్రిక్ తూకం యంత్రాన్ని ఉపయోగించి ప్రత్యక్షంగా చూపించాలని పట్టుబట్టండి. దానిపై సిలిండర్ పెట్టి బరువు తూచండి. 29 కిలోల కంటే తక్కువ ఉంటే సిలిండర్ లీక్ అవుతోందని లేదా గ్యాస్ తక్కువగా ఇచ్చారని అర్థం చేసుకోండి.

గ్యాస్ లీక్ లేదా తక్కువ ఉందనిపిస్తే డెలివరీ బాయ్‌కి చెప్పి మరో సిలిండర్ ఇవ్వమని అడగండి. అతడు సరిగా స్పందించకపోతే మీ LPG పంపిణీదారునికి లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయవచ్చు.
Updated at - Feb 09 , 2025 | 04:43 PM