Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

ABN, Publish Date - May 03 , 2025 | 06:13 PM

కొందరు అత్యవస సమయాల్లో మూత్రాన్ని బలంవంతంగా ఆపేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రయాణ సమయాలు, పట్టణాలు, నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకున్నా కూడా కొందరు మూత్రాన్ని ఆపుకొంటుంటారు. అయితే..

Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు.. 1/7

కొందరు అత్యవస సమయాల్లో మూత్రాన్ని బలంవంతంగా ఆపేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రయాణ సమయాలు, పట్టణాలు, నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకున్నా కూడా కొందరు మూత్రాన్ని ఆపుకొంటుంటారు. అయితే ఇలా మూత్రాన్ని బలవంతంగా ఆపడం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు.. 2/7

మూత్రాన్ని ఎక్కువ సేపు నిలుపుకోవడం వల్ల అది మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది లైంగిక ఆరోగ్యంతో పాటూ మెదడు, మూత్రపిండాలపై పడుతుందని చెబుతున్నారు.

Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు.. 3/7

మూత్రంలో 95 శాతం నీరు ఉంటుంది. అలాగే 2 శాతం యూరియా, కాల్షియం, సోడియం, పొటాషియం ఉంటాయి. మూత్రాన్ని ఎక్కువ సేపు నిలపడం వల్ల యూరియా స్పటికాల రూపంలో మూత్రపిండాల్లో పేరుకుపోతుంది. ఇది చివరకు రాళ్లలాగా మారుతుంది.

Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు.. 4/7

మూత్రపిండాలు సాధారణంగా రోజులో 180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అయితే ఎక్కవు సేపు మూత్రాన్ని ఆపడం వల్ల ఆ సామర్థ్యం తగ్గిపోతుంది. కొన్ని సార్లు రక్తస్రావానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది.

Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు.. 5/7

మూత్రాశయాన్ని కండరాలు పట్టుకుని ఉంటాయి. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఆ కండరాలు సాగిపోతాయి. ఇది చివరకు అంగస్తంభన సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు.. 6/7

మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపడం వల్ల శరీరం మెదడు నుంచి సంకేతాలను స్వీకరించడం కూడా కష్టమవుతుంది.

Health Tips: మూత్రాన్ని బలవంతంగా ఆపుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 03 , 2025 | 06:13 PM