Health Tips: కడుపులో గ్యాస్ సమస్య వేధిస్తోందా.. అయితే ఈ సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:45 PM
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ సమస్యతో చాలా మంది నలుగురిలో బాగా ఇబ్బంది పడుతుంటారు. దీని నివారణకు ఏవోవే మందులు వాడుతుంటారు. అయినా..
1/8
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ సమస్యతో చాలా మంది నలుగురిలో బాగా ఇబ్బంది పడుతుంటారు. దీని నివారణకు ఏవోవే మందులు వాడుతుంటారు. అయినా ఫలితం లేక సతమతమవుతుంటారు. ఇలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని సింపుల్ చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/8
కడుపులో గ్యాస్ సమస్య నివారణకు సెలెరీ బాగా పని చేస్తుంది. ఇందులోని థైమోల్ కడుపులోని సమస్యలను దూరం చేసి గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3/8
అర టీస్పూన్ సెలెరీ తిని, ఆ తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగాలి. ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
4/8
జీలకర్ర కూడా గ్యాస్ నివారణకు బాగా పని చేస్తుంది. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడడంతో పాటూ గ్యాస్ సమస్యలు దూరమవుతాయి.
5/8
గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను మరిగించాలి. రాత్రి భోజనం చేసిన 10 నిముషాల తర్వాత ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
6/8
ఇంగువ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఒక గ్లాసు గోసు గోరువెచ్చని నీటిలో ఇంగువను కలపాలి. గ్యాస్ సమస్య అనిపించినప్పుడు ఈ నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది.
7/8
గ్యాస్ సమస్య నివారణలో అల్లం ఎంతో బాగా పని చేస్తుంది. అర కప్పు నీటిలో టీ స్పూన్ అల్లం వేసి మరిగించాలి. రాత్రి భోజనం తర్వాత ఈ నీటిని తాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.
8/8
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jun 17 , 2025 | 03:45 PM