Health Tips: వందేళ్లు బతకాలి అనుకుంటున్నారా.. అయితే మీ ఆహారంలో ఈ 6 అలవాట్లు చేసుకుంటే చాలు.
ABN, Publish Date - May 20 , 2025 | 09:37 PM
వాతావరణంతో పాటూ ఆహారం కలుషితమైపోతున్న ప్రస్తుతం తరుణంలో మనిషి కూడా తగ్గుతూ వస్తోంది. ఒకప్పటి ఆహారానికి, ప్రస్తుత ఆహార అలవాట్లకు చాలా తేడాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే..
1/7
వాతావరణంతో పాటూ ఆహారం కలుషితమైపోతున్న ప్రస్తుతం తరుణంలో మనిషి కూడా తగ్గుతూ వస్తోంది. ఒకప్పటి ఆహారానికి, ప్రస్తుత ఆహార అలవాట్లకు చాలా తేడాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే కొన్ని ఆహార పదార్థాలను తినడం మానేయడం వల్ల మన ఆయుష్యును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/7
వ్యాయామం చేయడం వల్ల జీవితకాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి కేవలం 75 నిమిషాలు వేగంగా నడవడం వల్ల రెండేళ్ల ఆయుష్యు పెరుగుతుందట. అలాగే రోజూ దాదాపు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని చెబుతున్నారు.
3/7
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. తద్వారా జీవిత కాలం కూడా పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్, స్వీట్లు, వేయించిన, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం తగ్గించాలి.
4/7
రోజుకు 7నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమరహిత నిద్ర ఉన్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం 50% ఎక్కువ ఉందని పరిశోధనల్లో తేలింది.
5/7
ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లను మానేయాలి. వాటి స్థానంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం వల్ల ఆయుష్యు పెరుగుతుంది.
6/7
యోగా, ధ్యానం చేయడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
7/7
ఒంటరిగా ఉంటూ ఆలోచనలతో జీవించడం మానేయాలి. తరచూ మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గడుపుతుండాలి.
Updated at - May 21 , 2025 | 12:54 AM