Health Tips: తరచూ ఈ పండ్లు తిన్నారంటే.. క్యాన్సర్ మీ దరి చేరదు..
ABN, Publish Date - Jun 15 , 2025 | 07:12 AM
ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. క్యా్న్సర్ మరణాల రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. ఇందుకు ప్రధానంగా ఆహార అలవాట్ల కారణమని చెప్పొచ్చు. అయితే..
1/8
ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. క్యా్న్సర్ మరణాల రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. ఇందుకు ప్రధానంగా ఆహార అలవాట్ల కారణమని చెప్పొచ్చు. అయితే కొన్ని ఆహార అలవాట్లు చేసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/8
క్యాన్సర్‌ను నివారించడంలో బ్రోకలీ కూడా బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే సల్పోరాఫేన్ అనే సమ్మేళనం రొమ్ము క్యాన్సర్‌తో పాటూ ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అదేవిధంగా పెద్ద ప్రేగు, మల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
3/8
ఆపిల్స్‌లో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఆపిల్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటూ శరీరంలో వాపు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్‌ను కూడా ఇది నిరోధించగలదు.
4/8
సాల్మన్, మాకేరెల్, ఆంకోవీస్ వంటి కొవ్వు చేపలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ చేపల్లోని విటమిన్-బి, పొటాషియం, ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు.. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
5/8
అవోకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
6/8
క్యారెట్లు కూడా క్యాన్సర్ నిరోధకాలుగా పని చేస్తాయి. ప్రధానంగా కడుపు, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో క్యారెట్లు అద్భుతంగా పని చేస్తాయి.
7/8
ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది. ద్రాక్ష, వాటి విత్తనాల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిన్లు తదితర పోషకాలు క్యాన్సర్‌ను నిరోధించడంలో బాగా పని చేస్తాయి.
8/8
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంతో పాటూ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
Updated at - Jun 15 , 2025 | 07:12 AM