Constipation Health Tips: రోజూ ఈ 5 పండ్లు తింటే.. మలబద్ధక సమస్య దూరమైనట్లే..
ABN, Publish Date - Sep 02 , 2025 | 10:06 PM
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆహార అలవాట్లే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తరచూ ఈ 5 పండ్లు తినడం వల్ల పేగులు మొత్తం శుభ్రం అవుతాయి.
1/8
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆహార అలవాట్లే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తరచూ ఈ 5 పండ్లు తినడం వల్ల పేగులు మొత్తం శుభ్రం అవుతాయి. అలాగే పేగుల్లో పేరుకుపోయిన మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/8
మలబద్ధక సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అయితే మీ ఆహారంలో కొన్ని పండ్లను చేర్చడం వల్ల మలబద్ధక సమస్య దూరమవుతుంది.
3/8
పియర్ పండులో 5.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది పేగుల్లోని మలాన్ని మృదువుగా చేస్తుంది. తద్వారా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
4/8
ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్‌లో దాదాపు 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మలం సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది. దీన్ని నేరుగా తినవచ్చు, లేదా స్మూతీలో కలుపుకొని తీసుకోవచ్చు.
5/8
ఆపిల్ పండులో దాదాపు 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే దీని తొక్కలో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే గుజ్జులో పెక్టిన్ ఉంటుంది. పెక్టిన్ అనేది ప్రీబయోటిక్.. ఇది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, మలవిసర్జనను సాఫీగా జరిగేలా చేస్తుంది.
6/8
నారింజ, ద్రాక్షపండులో సుమారు 3 గ్రాముల ఫైబర్‌తో పాటూ పెక్టిన్ కూడా ఉంటుంది. వీటిలోని ఫ్లేవనాయిడ్ తేలికపాటి భేదిమందు ప్రభావాన్ని ఇస్తుంది. తద్వారా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
7/8
ఒక కివి పండులో దాదాపు 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. రోజుకు 2 కివీ పండ్లు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది.
8/8
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Sep 02 , 2025 | 10:06 PM