Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే..

ABN, Publish Date - May 04 , 2025 | 03:47 PM

కొన్ని రోజు వారీ ఆహారాలు తీసుకోవడం ద్వారా కేన్సర్‌ను దూరం చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 1/8

దేశంలో కేన్సర్ రోగులు పెరుగుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 2022 నుంచి నిర్వహించిన అధ్యయనంలో దేశంలో ప్రతి లక్ష మందికి.. కేన్సర్ మరణాల సంఖ్య 64.7 గా ఉందని తెలిసింది. 2050 నాటికి ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేన్సర్‌ను దూరం చేసే ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 2/8

ప్రస్తుతం పోషకాహార లోపంతో చాలా మంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక కేన్సర్ రోగుల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజు వారీ ఆహారాలు తీసుకోవడం ద్వారా కేన్సర్‌ను దూరం చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 3/8

ఆపిల్స్‌లో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనం గుండె జబ్బులు, ఇన్ఫెక్షనలను నివారిస్తుంది. అలాగే కేన్సర్ కణాలను పెరగకుండా చేయడంలోనూ దోహదం చేస్తుంది.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 4/8

బ్రోకలీలోని సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం రొమ్ము క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. అలాగే ప్రోస్టేట్ కేన్సర్‌ను నిరోధించడంతో పాటూ పెద్ద ప్రేగు కేన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 5/8

సాల్మన్, మాకేరెల్, ఆంకోవీస్ తదితర కొవ్వు చేపలు ఆరోగ్యానికి బాగా పని చేస్తాయి. ఇందులోని విటమిన్-బి, పొటాషియం, ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు.. రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 6/8

క్యారెట్లు తీసుకోవడం వల్ల కడుపు, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్- A కి మారడం ద్వారా క్యాన్సర్ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 7/8

ద్రాక్ష తొక్కలో క్యాన్సర్‌ను నిరోధించే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష, వాటి విత్తనాలలో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిన్లు, ప్రోయాంథోసైనిడిన్లు, కాటెచిన్లు తదితరాలు క్యాన్సర్ నిరోధకాలుగా పని చేస్తాయి.

Health Tips: కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రోజు వారీ 5 ఆహారాలు ఇవే.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 04 , 2025 | 03:47 PM