Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

ABN, Publish Date - May 16 , 2025 | 07:47 AM

గుమ్మడికాయ గింజల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి.

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 1/7

గుమ్మడికాయ గింజల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. రోజూ ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 2/7

గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్‌ తదితర యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపు, వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడతాయి.

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 3/7

గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 4/7

గుమ్మడి గింజలు తరచూ తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సాయపడతాయి. ఇందులోని విటమిన్-E, ఫైటోస్టెరాల్స్‌ తదితర యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలు దెబ్బతినకుండా సాయపడతాయి.

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 5/7

గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం.. శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి సాయపడుతుంది. అలాగే నాడీ వ్యవస్థను కాపాడడంలో కూడా సాయం చేస్తాయి.

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 6/7

ఈ విత్తనాలు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 16 , 2025 | 07:47 AM