Health Tips: నెల రోజుల పాటు రోజుకు 5 నానబెట్టిన బాదం పప్పులు తింటే.. జరిగేది ఇదే..
ABN, Publish Date - Sep 04 , 2025 | 09:02 PM
బాదం పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. అయితే రోజూ 5 బాదం పప్పులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
1/9
బాదం పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. అయితే రోజూ 5 బాదం పప్పులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/9
రోజూ 5 నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల ఆహారంలోని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే బద్ధకం, అసౌకర్యం వంటి సమస్యలు దూరమై.. కడుపు తేలిగ్గా మారుతుంది.
3/9
బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్.. శరీరానికి అవసరమైన శక్తిని విడుదల చేయడంలో సహాయపడతాయి. అలాగే రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తాయి.
4/9
బాదంలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మ కణాలకు మరమ్మతులు చేసి, కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుంది.
5/9
బాదంలో రైబోఫ్లేవిన్, ఎల్-కార్నిటైన్ అనే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడు నిత్యం చురుగ్గా ఉండేలా సాయం చేస్తాయి.
6/9
బాదంలోని పొటాషియం, మెగ్నీషియం.. రక్తానికి అవసరమైన ఆక్సిజన్ అందించడంలో సాయం చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేయడంతో పాటూ గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో సాయం చేస్తుంది.
7/9
బాదంలోని ఫైబర్, ప్రోటీన్.. బరువు నియంత్రణలో ఉంచడంలో సాయం చేస్తాయి. అదేవిధంగా కోరికలను నియంత్రించడంలో బాదం సహాయపడుతుంది.
8/9
బాదంలోని మెగ్నీషియం, భాస్వరం అనే ఖనిజాలు ఎముకలకు అదనపు బలాన్ని ఇస్తాయి. బాదం ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా దంతాలను బలంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.
9/9
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Sep 04 , 2025 | 09:02 PM