Constipation: మలబద్ధకం రాకుండా ఉండాలంటే.. ఈ 5 పండ్లను తినండి చాలు..
ABN, Publish Date - Apr 10 , 2025 | 07:00 AM
ప్రస్తుతం చాలా మంది మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల గ్యాస్, వికారం, కడుపు నొప్పి, ఫిస్టులా వంటి అనేక సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి మలబద్ధక సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఎండిన రేగుపండ్లలో ఫైబర్, సార్బిటాల్, ఫినాలిక్ తదితర పోషకాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక మలబద్ధక సమస్యను కూడా తొలగిస్తాయి.

కివీ పండ్లలో ఆక్టినిడిన్, ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని సరిగ్గా జీర్ణయం చేస్తాయి. తద్వారా మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది.

అంజీర పండ్లలోని అనేక పోషకాలు మలబద్ధక సమస్యకు బాగా పని చేస్తాయి. ఇది మలాన్ని మృదువుగా చేయడం ద్వారా మలబద్ధక సమస్య రాకుండా చేస్తుంది. అయితే వీటిని మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

బేరి పండ్లలోని ఫైబర్ మలబద్ధక సమస్యకు బాగా పని చేస్తుంది. ఈ పండ్ల తొక్కను కూడా తినాలని, తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Updated at - Apr 10 , 2025 | 07:00 AM