Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా..

ABN, Publish Date - Jul 06 , 2025 | 02:04 PM

వర్షాకాలంలో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో పాలకూర రసం తాగితే..

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 1/8

వర్షాకాలంలో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 2/8

పాలకూరలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి పాలకూర చాలా బాగా పని చేస్తుంది.

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 3/8

వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పాలకూరలోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 4/8

పాలకూరలో విటమిన్- కె, కాల్షియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడంతో పాటూ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 5/8

పాలకూరలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 6/8

పాలకూరలో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని దూరం చేయడంతో పాటూ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 7/8

పాలకూరలో లుటిన్, జియాక్సంతిన్ తదితరాలు కంటి ఆరోగ్యానికి సహకరిస్తాయి. కంటి శుక్లం, దృష్టి లోపం సమస్యలను దూరం చేస్తాయి.

Monsoon Health Tips: వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jul 06 , 2025 | 02:04 PM