Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

ABN, Publish Date - May 18 , 2025 | 07:55 AM

చియా గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.

Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 1/7

చియా గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 2/7

ముందుగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు నీటిలో 1 టేబుల్ స్పూన్ చియా గింజలను వేసి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. గింజలు ఉబ్బిన తర్వాత సగం నిమ్మకాయ రసం, కొన్ని పుదీనా ఆకులు, తేనె జోడించాలి. వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత తీసుకోవాలి.

Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 3/7

చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటితో కలిపి తాగడం వల్ల కడుపు నింపేలా చేయడమే కాకుండా దీర్ఘకాలిక హైడ్రేషన్‌కు కూడా దోహదం చేస్తుంది. ఈ పానీయం ద్రవాలను తిరిగి నింపడంతో పాటూ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడంలో సాయం చేస్తుంది.

Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 4/7

చియా గింజల్లో ఉండే అధిక ఫైబర్ ప్రేగు కదలికలకు సాయం చేస్తుంది. అలాగే నిమ్మకాయ సహజ నిర్విషీకరణకారిగా పనిచేస్తూ.. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సాయం చేస్తుంది. అదేవిధంగా కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.

Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 5/7

నిమ్మకాయలోని విటమిన్-C రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చియా గింజల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపు రాకుండా చేస్తాయి. అలాగే ఈ పానీయం ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేయడంలోనూ సహకరిస్తుంది.

Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 6/7

చియా గింజలు, నిమ్మకాయ పుదీనా నీరు తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సాయం చేస్తుంది.

Chia Seeds: చియా గింజలను నిమ్మకాయ, పుదీనా నీటిలో కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 18 , 2025 | 07:55 AM