Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..

ABN, Publish Date - Jun 28 , 2025 | 05:21 PM

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. హార్మోన్లను తయారు చేయడంతో పాటూ రక్తాన్ని శుభ్రపరచడం, ఆహారాన్ని జీర్ణం చేయడంలోనూ ఇది సాయపడుతుంది. అయితే కొన్ని దురలవాట్ల కారణంగా కాలేయం దెబ్బతింటూ వస్తుంది. ముఖ్యంగా..

Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..  1/7

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. హార్మోన్లను తయారు చేయడంతో పాటూ రక్తాన్ని శుభ్రపరచడం, ఆహారాన్ని జీర్ణం చేయడంలోనూ ఇది సాయపడుతుంది. అయితే కొన్ని దురలవాట్ల కారణంగా కాలేయం దెబ్బతింటూ వస్తుంది. ముఖ్యంగా మద్యం, చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే కొన్ని పనులు చేయడం వల్ల దెబ్బతిన్న కాలేయం తిరిగి మళ్లీ చురుగ్గా పని చేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..  2/7

ఆల్కాహాల్ అతిగా తాగేవారికి కాలేయం త్వరగా పాడవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మద్యానికి దూరంగా ఉండండి.

Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..  3/7

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలను అతిగా తినడం మంచిది కాదు. కొన్నిసార్లు ఇది కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..  4/7

ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో తీసుకోవడం కూడా కాలేయానికి ప్రమాదం. మీ ఆహారంలో వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే.. మీ కాలేయానికి అంత మంచిది.

Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..  5/7

ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను అస్సలు తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల కూడా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..  6/7

బీఫ్, పంది, మేక వంటి రెడ్ మీట్‌ను ఎక్కువగా తిన్నా కూడా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వీటిని తీసుకోవడం తగ్గిస్తే మంచిది.

Liver Health Tips: దెబ్బతిన్న కాలేయం బాగుపడాలంటే.. వెంటనే ఈ 5 పనులు చేయండి చాలు..  7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jun 28 , 2025 | 05:21 PM