Health Tips: ఈ 3 పనులు చేస్తే.. వందేళ్ల ఆయుష్యు మీ సొంతమైనట్లే..
ABN, Publish Date - Aug 28 , 2025 | 06:04 AM
ప్రస్తుత జీవన విధానంలో యువత కూడా అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు తదితర కారణాలతో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే..
1/6
ప్రస్తుత జీవన విధానంలో యువత కూడా అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు తదితర కారణాలతో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఆయుష్యును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/6
అధిక బరువు లేదా ఊబకాయం అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న అధిక కొవ్వు.. రక్తపోటును పెంచుతుంది. తద్వారా ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
3/6
శరీరంలోని ఇతర కండరాల తరహాలోనే.. గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి వ్యాయామం ఎంతో అవసరం. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
4/6
రోజూ వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.
5/6
మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది. తద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరానికి అందించే సమతుల ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి.
6/6
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తద్వారా ఆయుష్యు కూడా పెరుగుతుంది.
Updated at - Aug 28 , 2025 | 06:04 AM