Ants Lifespan: చీమలు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా.. సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ABN, Publish Date - Nov 22 , 2025 | 08:41 PM
చీమలు లేని ఇల్లు ఉండదు. కొందరైతే చీమలతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు. పొరపాటున మీదకు పాకాయంటే వెంటనే నలిపి చంపేస్తుంటాం. అయితే చీమలు ఎంత కాలం జీవిస్తాయనే విషయం చాలా మందికి తెలీదు..
1/5
చీమలు లేని ఇల్లు ఉండదు. కొందరైతే చీమలతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు. పొరపాటున మీదకు పాకాయంటే వెంటనే నలిపి చంపేస్తుంటాం. అయితే చీమలు ఎంత కాలం జీవిస్తాయనే విషయం చాలా మందికి తెలీదు. చీమలు ఎంత కాలం జీవిస్తాయి. ఏ చీమల ఆయుష్యు ఎంత ఉంటుంది.. తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2/5
నల్ల చీమల్లో కొన్ని కొన్ని నెలలు జీవిస్తే, మరికొన్ని సంవత్సరాలు జీవిస్తాయి. చాలా నల్ల చీమలు దాదాపు 1 నుంచి 2 సంవత్సరాలు జీవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాణి నల్ల చీమ 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తుందట.
3/5
మగ చీమలు తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయట. కొన్ని చీమలైతే వారాలు మాత్రమే జీవిస్తాయని చెబుతున్నారు. అయితే పని చేసే నల్ల చీమలు 1 నుండి 3 సంవత్సరాలు జీవించగలవు.
4/5
వేడి, చలి, వర్షం.. చీమల జీవితకాలంపై ప్రభావం చూపుతాయి. మంచి వాతావరణంలో చీమలు ఎక్కువ కాలం జీవిస్తాయని చెబుతున్నారు.
5/5
ప్రపంచంలో అనేక రకాల నల్ల చీమలు ఉన్నాయి ఉన్నాయి. వాటి జీవిత కాలం 1 నుంచి సుమారు 15 సంవత్సరాల వరకూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇతర కీటకాలు, నీరు, మనుషుల నుండి ముప్పును ఎదుర్కోకపోతే ఎక్కువ కాలం జీవించగలవని చెబుతున్నారు. అలాగే తగినంత ఆహారం లభించినా కూడా వాటి జీవిత కాలం పెరుగుతుందట.
Updated at - Nov 22 , 2025 | 08:45 PM