Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే..

ABN, Publish Date - Jun 19 , 2025 | 07:32 PM

వర్షాకాలంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అనేక ఇన్ఫెక్షన్లతో పాటూ, బ్యాక్టీరియా కారణంగా వివిధ రకాల జబ్బులు సోకే ప్రమాదం ఉంటుంది. అయితే..

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 1/8

వర్షాకాలంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అనేక ఇన్ఫెక్షన్లతో పాటూ, బ్యాక్టీరియా కారణంగా వివిధ రకాల జబ్బులు సోకే ప్రమాదం ఉంటుంది. అయితే దీన్ని అధిగమించేందుకు వర్షాలకాలంలో కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 2/8

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. శ్వాసకోశ మార్గాలను క్లియర్ చేయడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే వర్షాకాలంలో సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం అర టీస్పూన్ ఎండు అల్లం పొడిని గోరువెచ్చని నీటిలో గానీ టీ లేదా సూప్‌లలో కలిపి తీసుకోవాలి.

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 3/8

వర్షాకాలంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో పసుపు కూడా బాగా పని చేస్తుంది. పసుపును కూరలు, పాలు తదితరాల్లో కలుపుకొని తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 4/8

తులసిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే అనేక ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సాయం చేస్తుంది. తులసి టీలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 5/8

వేపాకు రక్తాన్ని శుద్ధి చేసి, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహకరిస్తుంది. ఇందులోని యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, టీటాక్సిఫైయింగ్ లక్షణాలు.. చర్మ వ్యాధులు, జ్వరాల నుంచి కాపడతాయి.

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 6/8

గుమ్మడి గింజల్లోని జింక్, యాంటీఆక్సిడెంట్లు.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఒక స్పూన్ నానబెట్టిన గుమ్మడి గింజలను మీ బ్రేక్ ‌ఫాస్ట్‌లో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 7/8

నల్ల మిరియాల్లోని పైపెరిన్ శరీరంలో పోషకాల శోషణను పెంచుతుంది. అలాగే జలుబును కూడా దూరం చేస్తుంది. మీరు తినే ఆహారంలో నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకోవడం లేదా సూప్‌లలో జోడించి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Health Tips: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 6 ఆహారాలివే.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jun 19 , 2025 | 07:32 PM