Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు..

ABN, Publish Date - Jul 03 , 2025 | 10:32 AM

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. చిన్న వయసు వారు కూడా షుగర్ వ్యాధికి గురై ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి షుగర్ పెరిగిపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే ..

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 1/8

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. చిన్న వయసు వారు కూడా షుగర్ వ్యాధికి గురై ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి షుగర్ పెరిగిపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే కొన్ని ఆకుకూరలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 2/8

బిల్వ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి . కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 3/8

కాండ్రు (కంద) ఆకుల కషాయం తీసుకోవడం వల్ల మధుమేహ రోగులకు షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 4/8

బే ఆకులు (బిర్యానీ ఆకులు) తినడం వల్ల ప్లాస్మా గ్లూకోజ్ తగ్గుతుందట. అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే సామర్థ్యం కూడా ఈ ఆకులకు ఉందని పరిశోధనల్లో తేలింది. ఈ ఆకులు షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచడంతో పాటూ గుండె, మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 5/8

మెంతి ఆకుల రసం కూడా షుగర్‌ లెవల్స్‌ను అదుపు చేయడంలో బాగా పని చేస్తుంది. మెంతికూరను రాత్రి వేడి నీటిలో నానబెట్టి, ఉదయం తాయడం వల్ల కూడా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 6/8

మధుమేహాన్ని నియంత్రించడంలో గుర్మార్ ఆకులు బాగా పని చేస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ అథెరోస్క్లెరోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి మేలు చేస్తాయి.

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 7/8

పైన సూచించిన 5 ఆకులతో పాటూ రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తంలో షుగర్స్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

Health Tips: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా.. అయితే వెంటనే ఈ 5 ఆకుకూరలు తినండి చాలు.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jul 03 , 2025 | 10:32 AM