Cooking Oil : వంట నూనె కొనేటప్సుడు ఏది సరైనదో ఎలా తెలుసుకోవాలి...

ABN, Publish Date - Mar 17 , 2025 | 06:35 PM

Cooking Oil : నూనె వేయకుండా వంట పూర్తికాదు. ఇది లేకుండా కూరలు చేయడం అసాధ్యం. ఎక్కువ నూనె తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్పినా రోజూవారీ ఆహారంలో తగినంత మోతాదులో నూనె తప్పనిసరిగా వాడాల్సిందే. అయితే, ఏ వంట నూనె సరైనదో.. కొనేటప్పుడో ఏవి ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం.

Cooking Oil : వంట నూనె కొనేటప్సుడు ఏది సరైనదో ఎలా తెలుసుకోవాలి... 1/5

పల్లీలు, పొద్దుతిరుగు విత్తనాలు, ఆవాలు, ఆలివ్, కొబ్బరి, ఇలా రకరకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తక్కువ సంతృప్త కొవ్వులు, గుండెకు ఆరోగ్యకరమైన MUFA లు సమృద్ధిగా ఉన్న నూనెలను ఎంచుకోండి.

Cooking Oil : వంట నూనె కొనేటప్సుడు ఏది సరైనదో ఎలా తెలుసుకోవాలి... 2/5

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కచ్చితంగా హైడ్రోజనేటెడ్ నూనెలు వాడకానికి దూరంగా ఉంటే మంచిది.

Cooking Oil : వంట నూనె కొనేటప్సుడు ఏది సరైనదో ఎలా తెలుసుకోవాలి... 3/5

బదులుగా కోల్డ్-ప్రెస్డ్ నూనెలు ఎంచుకోండి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. శుద్ధి చేసిన నూనెలతో పోలిస్తే ఇవి చాలా మంచి ఎంపిక.

Cooking Oil : వంట నూనె కొనేటప్సుడు ఏది సరైనదో ఎలా తెలుసుకోవాలి... 4/5

ప్రతి నూనెకు వేర్వేరు స్మోక్ పాయింట్ ఉంటుంది. వేయించడానికి మీరు హై-స్మోక్ పాయింట్ ఆయిల్స్ ఎంచుకోండి. అదే డ్రెస్సింగ్ కోసం అయితే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్స్ వాడండి.

Cooking Oil : వంట నూనె కొనేటప్సుడు ఏది సరైనదో ఎలా తెలుసుకోవాలి... 5/5

మరొక్క విషయం ఏంటంటే, ఏ మొక్క నుంచి సేకరించిన నూనె అయినా కొలెస్ట్రాల్ తప్పకుండా ఉంటుంది. 'కొలెస్ట్రాల్ లేనిది' అనే ఏ ప్రొడక్ట్ చెప్పినా ఒకసారి ఆలోచించండి . మీ నూనెను జాగ్రత్తగా ఎంచుకోండి.

Updated at - Mar 17 , 2025 | 06:38 PM