Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా..

ABN, Publish Date - Sep 18 , 2025 | 05:04 PM

చాలా మంది స్నానం అంటే చల్లటి లేదా వేడి నీటితో చకచకా స్నానం చేసేస్తుంటారు. అయితే స్నానం నీటిలో కొన్నింటిని కలపడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలీదు.

Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా.. 1/7

చాలా మంది స్నానం అంటే చల్లటి లేదా వేడి నీటితో చకచకా స్నానం చేసేస్తుంటారు. అయితే స్నానం నీటిలో కొన్నింటిని కలపడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలీదు. ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా.. 2/7

ఉప్పు నీటిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంలోని బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సాయం చేస్తాయి. అలాగే చర్మంపై వాపు, ఎరుపు తగ్గించి చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా.. 3/7

ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం ఎక్కువ ఖనిజాలను గ్రహిస్తుంది. అలాగే శరీరంలో మెగ్నీషియం స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా కండరాలు సడలేలా చేసి, నిద్రను మెరుగుపరుస్తుంది.

Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా.. 4/7

ఉప్ప నీటితో స్నానం చేయడం వల్ల చర్మ రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడతో పాటూ శరీరానికి మాయిశ్చరైజర్‌గానూ పని చేస్తుంది.

Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా.. 5/7

జిమ్‌లో వ్యాయామం చేసే వారు ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. బిగుతుగా ఉన్న కండరాలను సడలింపజేసి, నొప్పులను తగ్గిస్తుంది.

Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా.. 6/7

మీ పాదాలు నొప్పిగా అనిపించినా, అసలిపోయినట్లుగా ఉన్నా కూడా ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, దురద, గోరు ఫంగస్ తగ్గిపోతుంది. అలాగే దుర్వాసన కూడా తగ్గిపోతుంది.

Bathing Tips: నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.

Updated at - Sep 18 , 2025 | 05:04 PM