Aloe Vera Health Tips: రాత్రి పడుకునే ముందు కలబందను ముఖానికి రాసుకుంటే.. ఏమవుతుందో తెలుసా..

ABN, Publish Date - Sep 26 , 2025 | 12:47 PM

అలో వేరా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎంతో మేలు చేస్తాయి. అయితే..

Aloe Vera Health Tips: రాత్రి పడుకునే ముందు కలబందను ముఖానికి రాసుకుంటే.. ఏమవుతుందో తెలుసా.. 1/6

అలో వేరా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎంతో మేలు చేస్తాయి. అయితే కలబందను రాత్రిపూట ముఖానికి రాసుకోవడ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Aloe Vera Health Tips: రాత్రి పడుకునే ముందు కలబందను ముఖానికి రాసుకుంటే.. ఏమవుతుందో తెలుసా.. 2/6

పడుకునే ముందు ముఖానికి కలబందను అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. అలాగే ఇందులోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.

Aloe Vera Health Tips: రాత్రి పడుకునే ముందు కలబందను ముఖానికి రాసుకుంటే.. ఏమవుతుందో తెలుసా.. 3/6

కలబందను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు, సన్‌టాన్ తొలగిపోతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. అలోవేరా చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

Aloe Vera Health Tips: రాత్రి పడుకునే ముందు కలబందను ముఖానికి రాసుకుంటే.. ఏమవుతుందో తెలుసా.. 4/6

చర్మం చికాకుగా, దురదగా ఉన్నా కూడా కలబందను రాయాలి. ఇలా చేస్తే ఈ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలోవేరా చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది.

Aloe Vera Health Tips: రాత్రి పడుకునే ముందు కలబందను ముఖానికి రాసుకుంటే.. ఏమవుతుందో తెలుసా.. 5/6

కలబందను రాసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత తాజా కలబంద జెల్ లేదా మార్కెట్‌లో కొన్న మంచి స్వచ్ఛమైన కలబంద జెల్‌ను ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రాత్రంతా ఉంచి, ఉదయం చల్లటి నీటితో కడుక్కోవాలి. అయితే కలబంద రాయగానే దురద, మంటగా ఉంటే నిపుణులను సంప్రదించాలి.

Aloe Vera Health Tips: రాత్రి పడుకునే ముందు కలబందను ముఖానికి రాసుకుంటే.. ఏమవుతుందో తెలుసా.. 6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Sep 26 , 2025 | 12:47 PM