ఈ జంతువుల్లో ‘హెచ్‌ఐవీ’ తరహా వైరస్!
ABN, Publish Date - Jul 09 , 2025 | 09:00 PM
Animals with HIV like Virus: మనుషులకు మాత్రమే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV), అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS) వంటివి సోకుతాయనుకుంటే అది చాలా పొరపాటు. నిజానికి కొన్ని జంతువుల్లో అచ్చం ఇలాంటి వైరస్ లే సోకుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ జంతువుల పేర్లేంటో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు.
1/6
జంతువుల్లో HIV కి దగ్గరి బంధువు అయిన సిమియన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (SIV) సోకుతుంది. ఇది ప్రధానంగా చింపాంజీలు, గొరిల్లాలు వంటి క్షీరదాల్లో కనిస్తుంది.
2/6
HIV-1, HIV-2 అనేవి SIV నుంచే ఉద్భవించాయని నమ్ముతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, SIV ప్రధానంగా చింపాంజీలు, మాండ్రిల్స్, మకాక్ కోతులు వంటి ఆఫ్రికన్ క్షీరదాల నుంచి వచ్చింది.
3/6
కొన్ని అధ్యయనాలు పిల్లులలో ఫెలైన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (FIV), ఆవులలో బోవిన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (BIV) ను ఉన్నట్లు గుర్తించారు.
4/6
SIVcpz సోకిన చింపాంజీల్లో బరువు తగ్గడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఇలా AIDS వంటి లక్షణాలే కనిపించాయి.
5/6
కుక్కలలో HIV లేదా SIV వంటి వైరస్ సోకినట్లు నిరూపించడానికి ఇంకా సరైన శాస్త్రీయ ఆధారం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుక్కలకు ఇతర వైరల్ వ్యాధులు రావచ్చు కానీ AIDS కాదు.
6/6
క్షీరదాల్లో లైంగిక సంబంధం, రక్త మార్పిడి, తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు లేదా తల్లిపాల ద్వారా SIV వ్యాపిస్తుంది. పిల్లులలో FIV కాటు లేదా రక్తం ద్వారా వ్యాపిస్తుంది.
Updated at - Jul 09 , 2025 | 09:00 PM