Poisonous Animals: అమాయకంగా కనిపించే.. 5 అత్యంత విషపూరితమైన జీవులివే..
ABN, Publish Date - Jun 29 , 2025 | 08:53 PM
ప్రకృతి ఎంతో విచిత్రమైంది. అలాగే మనకు తెలీని అనేక విచిత్రమైన జీవులు భూమ్మీద సంచరిస్తుంటాయి. అలాగే..

ప్రకృతి ఎంతో విచిత్రమైంది. అలాగే మనకు తెలీని అనేక విచిత్రమైన జీవులు భూమ్మీద సంచరిస్తుంటాయి. అలాగే పైకి అమాయకంగా కనిపించే.. 5 అత్యంత విషపూరితమైన జీవులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోన్ నత్త చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దీనిలో దాగి ఉన్న విషం ఒక్క క్షణంలో మనిషిని పక్షవాతానికి గురి చేస్తుంది. వెచ్చని సముద్రపు నీటిలో నివసించే ఈ జీవి.. తన ఎరపై విషపు దంతాలతో దాడి చేస్తుంది.

నీలిరంగు వలయాలు కలిగిన ఆక్టోపస్‌లో మనిషిని చంపేంత విషం ఉంటుంది. ఆస్ట్రేలియా, జపాన్ తీరప్రాంత జలాల్లో కనిపించే ఈ ఆక్టోపస్ విషం.. మనిషి శరీరాన్ని స్తంభింపజేస్తుంది. తర్వాత ఒక్కసారిగా శ్వాసను ఆపేస్తుంది.

ఆస్ట్రేలియాలో కనిపించే బాక్స్ జెల్లీ ఫిష్ కూడా ఎంతో ప్రమాదకరం. వీటి సన్నని పొడవై టెంటకిల్స్‌లో విషం దాగి ఉంటుంది. దీన్ని తాకితే భరించలేని నొప్పితో పాటూ మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది.

దక్షిణ అమెరికా అడవులలో కనిపించే పాయిజన్ డార్ట్ ఫ్రాగ్.. రంగు రంగుల బొమ్మల్లా కనిపిస్తాయి. కానీ ఈ కప్ప చర్మంలో విషం ఉంటుంది. ఈ కప్పలను తాకడం వల్ల మనిషికి ప్రాణాంతకంగా మారొచ్చు.

ఫియర్స్ స్నేక్ అని పిలువబడే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100 మందిని చంపగలదు. ఇది ఆస్ట్రేలియా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మనుషులకు దూరంగా ఉంటుంది.. కానీ వాటి జోలికి వెళితే మాత్రం క్షణాల్లో చంపేస్తుంది.
Updated at - Jun 29 , 2025 | 08:54 PM