తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది
ABN, Publish Date - Dec 10 , 2025 | 05:03 PM
తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (గురువారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకానుంది. తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
1/12
తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
2/12
రేపటి (గురువారం) ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
3/12
3836 గ్రామపంచాయతీలకు, 27,960 వార్డులకు పోలింగ్ జరుగనుంది.
4/12
13127 మంది సర్పంచ్ పదవికి పోటీ చేయనున్నారు.
5/12
67,893 మంది వార్డ్ మెంబర్ కోసం పోటీకి దిగారు.
6/12
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల మైదానంలో సర్పంచ్ ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్న ఎన్నికల అధికారులు.
7/12
స్థానిక సంస్థల ఎన్నికల కోసం మెటీరియల్‌ను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న అధికారులు.
8/12
ఎన్నికల సామాగ్రిని గ్రామాలకు తీసుకెళ్తున్న అధికారులు
9/12
ఎన్నికల కేంద్రాలకు తరలించే సామాగ్రిని, బాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకుంటున్న ఎన్నికల అధికారులు.
10/12
ఎలక్షన్ సామాగ్రితో బస్సుల్లో గ్రామాలకు వెళ్తున్న సిబ్బంది.
11/12
ఎన్నికల్లో బందోబస్తు గురించి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్న వనపర్తి జిల్లా ఎస్పీ సునీత. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ శాఖ సిబ్బంది, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
12/12
వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి.
Updated at - Dec 10 , 2025 | 05:07 PM