Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి
ABN, Publish Date - Nov 04 , 2025 | 04:52 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖ్వాజీ గూడ సమీపంలో సోమవారం (03-11-2025)ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. వీరి మరణంతో..ఆ కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
1/6
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖ్వాజీ గూడ సమీపంలో సోమవారం (03-11-2025)ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు.
2/6
వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. వీరి మరణంతో..ఆ కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
3/6
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్‌కు నలుగురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు.
4/6
మిగిలిన ముగ్గురు కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని. వీరు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తూ.. ఈ ప్రమాదంలో మరణించారు.
5/6
ఇక సాయి ప్రియతోపాటు అదే కళాశాలలో చదువుతున్న ముస్కాన్ అనే యువతి సైతం ఇదే బస్సు ప్రమాదంలో మరణించింది. దీంతో ఇద్దరు స్నేహితురాళ్లు ఈ ప్రమాదంలో మరణించడంతో వారి స్నేహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
6/6
కోఠి ఉమెన్స్ కాలేజీకి చెందిన ఈ విద్యార్థులకు సహచర విద్యార్థులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. వారితో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.
Updated at - Nov 04 , 2025 | 04:58 PM