గచ్చిబౌలిలో సేవ్ గర్ల్ చైల్డ్ అవగాహన రన్
ABN, Publish Date - Feb 02 , 2025 | 08:49 PM
గచ్చిబౌలి స్టేడియంలో సేవా భారతి ఆధ్వర్యంలో సేవ్ గర్ల్ చైల్డ్ అవగాహన రన్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరన్‌లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో సేవా భారతి ఆధ్వర్యంలో సేవ్ గర్ల్ చైల్డ్ అవగాహన రన్ ఆదివారం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరన్‌లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.

ఈ రన్‌ను అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, పోలీసు సూపరింటెండెంట్ శివ కుమార్ గౌడ్, అఖిల భారత సేవా భారతి ప్రధాన కార్యదర్శి రేణు పాఠక్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రన్‌లో కార్పొరేట్‌లు, వారి కుటుంబాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ రన్‌లో యువత భారీగా పాల్గొని సందడి చేశారు.

నిర్వాహకులు యువతకు అభినందనలు తెలిపారు.

ఈ రన్ గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు 5 కిలోమీటర్ల మేర కొనసాగింది.

సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల రన్ చేశారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ స్టేడియానికి రన్ చేరుకుంది.
Updated at - Feb 02 , 2025 | 08:51 PM