Nara Bhuvaneshwari: ఎన్టీఆర్ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్‌ని ప్రారంభించిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Nov 09 , 2025 | 07:35 AM
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెయిన్ గేటు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఎన్టీఆర్ స్త్రీ శక్తి హస్తకళ స్టోర్'ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శనివారం నాడు ప్రారంభించారు. ఆరువందల మందికి పైగా స్త్రీ శక్తి విమెన్ అసోసియేషన్ సభ్యులు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం హైదరాబాద్‌లో తొలి స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ని ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌లో వస్త్రాలు, గాజులు, చెవిపోగులు, హ్యాండ్ బ్యాగ్స్ విక్రయిస్తున్నారు.
1/10
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెయిన్ గేటు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఎన్టీఆర్ స్త్రీ శక్తి హస్తకళ స్టోర్'ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శనివారం నాడు ప్రారంభించారు.
2/10
ఆరువందల మందికి పైగా స్త్రీ శక్తి విమెన్ అసోసియేషన్ సభ్యులు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో శిక్షణ పొందారు.
3/10
మహిళల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం హైదరాబాద్‌లో తొలి స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ని ఏర్పాటు చేశారు.
4/10
ఈ స్టోర్‌లో వస్త్రాలు, గాజులు, చెవిపోగులు, హ్యాండ్ బ్యాగ్స్ విక్రయిస్తున్నారు.
5/10
'ఎన్టీఆర్ స్త్రీ శక్తి హస్తకళ స్టోర్'ను ప్రారంభించడం ఆనందంగా ఉందని నారా భువనేశ్వరి తెలిపారు.
6/10
ఈ స్టోర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష్ ఆకృతిలో ఉన్న విగ్రహం.
7/10
మహిళల సృజనాత్మకత, వ్యాపార స్ఫూర్తికి ఈ స్టోర్ నిదర్శనమని చెప్పుకొచ్చారు నారా భువనేశ్వరి.
8/10
మహిళలకు ఆత్మనిర్భరత కల్పిస్తూ, హస్తకళల వారసత్వాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు నారా భువనేశ్వరి.
9/10
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న స్టోర్.
10/10
మన గొప్ప చేనేత వారసత్వాన్ని ప్రోత్సహిస్తూనే, స్వావలంబన, ఆర్థిక స్వాతంత్య్రం వైపు మహిళలను శక్తివంతం చేస్తున్నామని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
Updated at - Nov 09 , 2025 | 07:39 AM